»Gujarati Flavour To Naga Chaitanyas Next Film Title
Naga Chaitanya: నాగ చైతన్య సినిమాలో గుజరాత్ ఫ్లేవర్..!
అక్కినేని వారసుడు నాగ చైతన్యకి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరుసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు.
ప్రస్తుతం చైతూ గతంలో తనతో ప్రేమమ్, సవ్యసాచి వంటి చిత్రాలను రూపొందించిన కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో జతకడుతున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కొత్త చిత్రంలో అక్కినేని హీరో “తాండల్” అని పిలువబడే హెల్మ్స్ మాన్ లేదా బోట్ డ్రైవర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు చైతూ ఇలాంటి పాత్రలో కనిపించలేదు. ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇక ఈ చిత్ర విజయంపై టీమ్ చాలా నమ్మకంగా ఉంది. కథ గుజరాత్ రాష్ట్ర నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అనేక దశాబ్దాల క్రితం గుజరాత్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆసక్తికరమైన మలుపులతో నిండిన రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది.‘తాండల్’ని టైటిల్‌గా పెట్టాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. చందూ మొండేటి, అతని బృందం ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేయడానికి విస్తృతమైన పరిశోధనలు చేసినట్లు తెలుస్తోంది. తాండెల్ అంటే ఫిషింగ్ బోట్ అధిపతి అని అర్థమట. వారి సంఘం గుజరాత్లో పెద్ద సంఖ్యలో నివశిస్తుంది.
పీరియాడికల్ డ్రామా కావడంతో, చిత్ర విజువల్ గ్రాండియర్‌ని నిర్ధారించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేయడానికి నిర్మాతలు భారీగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించడానికి అనిరుధ్ రవిచందర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.