టాలీవుడ్లో పద్మాలయ, రామకృష్ణా, రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ప్రజెంట్ రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోల్లోనే ఎక్కువగా ఇండోర్ షూటింగ్స్, సినిమాల ఓపెనింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఔట్ డోర్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అల్లు వారి స్టూడియో కూడా రెడీ అయిపోయింది. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం.. ఆయన తనయుడు, నిర్మాత అల్లు అరవింద్ దాదాపు పది ఎకరాల్లో అల్లు స్టూడియోని నిర్మించారు. సిటీ అవుట్ స్కర్ట్స్‌లో అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోని భారీగా నిర్మించారు. అక్టోబర్ 1న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ స్టూడియోని ప్రారంభించారు. దీనికి చిరంజీవి దంపతులతో పాటు అల్లు ఫ్యామిలీ హాజరైంది. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. తాను నటుడిగా మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి అల్లు రామలింగయ్యే కారణమని గుర్తుచేసుకున్నారు. అల్లు రామలింగయ్య పేరుతో ఏర్పాటు చేసిన స్టూడియోను తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇప్పుడు అల్లు అనేది బ్రాండ్‌గా మారిందని.. అల్లు రామలింగయ్య పేరును తరతరాలు గుర్తించుకునేలా.. ఈ స్టూడియోని నిర్మించారని… ఈ కుటుంబంలో తాను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నట్టు.. చెప్పారు చిరంజీవి.
ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ఇవాళ మా తాతయ్య 100వ పుట్టినరోజు.. మాకెంతో ప్రత్యేకం.. డబ్బు సంపాదించడం కోసం ఈ స్టూడియోను నిర్మించలేదు.. ఇది మా తాతయ్య కోరిక.. ఆయన జ్ఞాపకార్థం నిర్మించామని.. పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లు స్టూడియోకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇక్కడ చెప్పుకోవల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ కార్యక్రమంతో నిన్న మొన్నటి వరకు అల్లు వర్సెస్ మెగా వార్ చెక్ పడిందనే చెప్పొచ్చు.