థియేటర్ కంటే ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఫుల్ హంగామా చేస్తున్నారు మెగాభిమానులు. ప్రమోషన్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు మెగాస్టార్. ట్విట్టర్ వేదికగా చేసిన ఒకే ఒక్క పొలిటికల్ డైలాగ్ ‘గాడ్ ఫాదర్’ పై అంచనాలను పెంచేసింది. ఇక సెప్టెంబర్ 28న అనంతపురంలో భారీ ఎత్తున మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నారు. ఈ ఈవెంట్‌కు మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 5న ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ పై అంచనాలను పెంచేసే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా మలయాళ మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఒరిజనల్ సోల్ మిస్ అవకుండా.. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ‘గాడ్ ఫాదర్’లో కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని కమర్షియల్ అంశాలు యాడ్ చేశారట. ముఖ్యంగా క్లైమాక్స్ కొత్తగా ట్రై చేసినట్టు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్‌ఖాన్ కీలక పాత్రలో నటించాడు. గాడ్‌ఫాదర్ కోసం ఏదైనా చేసే సోలోమేట్లా సల్మాన్ కనిపించనున్నాడని చిరు చెప్పుకొచ్చారు. దాంతో ఈ సినిమా క్లైమాక్స్ హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. క్లైమాక్స్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కోసం భారీ ఫైట్ డిజైన్ చేశారట. ఈ క్లైమాక్స్ ఫైట్ సుమారు 15 నిమిషాలు ఉంటుందని టాక్. దాంతో ఈ ఇద్దరు కలిసి చేసే ఫైట్ మెగా ట్రీట్ ఇవ్వడం ఖాయమంటున్నారు.