Mokshagna:వారసుడి కోసం వందకోట్ల దర్శకుడిని రంగంలోకి దింపిన బాలయ్య?
మోక్షజ్ఞ డెబ్యూ మూవీని దర్శకత్వం చేసే డైరెక్టర్ల జాబితా చాలానే వచ్చింది. లాంచింగ్ ప్రాజెక్ట్‌కు పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరకి దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రంగంలో దిగారని సమాచారం.
Mokshagna: బాలయ్య వారసుడి ఎంట్రీకోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇదిగో వచ్చేస్తున్నాడు.. అదిగో వచ్చేస్తున్నడు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ ఎప్పటి కప్పుడు ఎంట్రీ ప్రశ్నార్థకంగానే మారిపోయింది. మళ్లీ ఇప్పుడు అలాంటి వార్తే సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం లేకపోలేదు. మోక్షజ్ఞ గతంలో లావుగా బొద్దుగా ఉండేవాడు. ప్రస్తుతం బరువు తగ్గి చాలా హ్యాండ్ సమ్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ లుక్ చూసిన వాళ్లంతా ఇదంతా సినిమాల్లో ఎంట్రీకోసమే అని ఫిక్స్ అయిపోయారు.
అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీని దర్శకత్వం చేసే డైరెక్టర్ల జాబితా చాలానే వచ్చింది. లాంచింగ్ ప్రాజెక్ట్‌కు పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరకి దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రంగంలో దిగారని సమాచారం. నాని(Nani) కెరీర్లోనే రూ.100కోట్ల బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ పై బాలయ్య బాబు కు పూర్తి నమ్మకం ఉందని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా మొదలయ్యాయని టాక్.. త్వరలోనే మోక్షజ్ఞ మూవీ పై ప్రకటన రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అప్పట్లో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలిసేందే. ఇక మోక్షజ్ఞ కూడా డ్యాన్స్,యాక్టింగ్ లో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నారని సమాచారం.