మెగాస్టార్ అప్ కమింగ్ ఫిల్మ్ ఊరమాస్‌గా రాబోతోంది. అందుకే ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందుకే మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, బాస్ పార్టీ సాంగ్‌తో దుమ్ముదులిపాడు డీజె వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో బ్యాలెన్స్ షూటింగ్‌ను కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరబాద్‌లో చిరంజీవి, రవితేజలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఆ తర్వాత చిరంజీవి, శృతిహాసన్పై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారట. అందుకోసం విదేశాలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 7న ఫారిన్లో ఈ సాంగ్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ పాటతో వాల్తేరు వీరయ్య షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై మరింత దృష్టి సారించనుంది. అలాగే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. ప్రమోషన్స్ కూడా స్పీడప్ చేయబోతున్నారు. అతి త్వరలోనే మాస్ మహారాజా రవితేజకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో దాదాపు నలభై నిమిషాలకు పైగా చిరు-రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు టాక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.