మెగాస్టార్ చిరంజీవిపై యాక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1982లో చిరు, మోహన్‌బాబు కలిసి నటించిన చిత్రం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ గురించి పలు విషయాలను పంచుకున్నారు. ‘నా స్నేహితుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయనకు సోదరుడిగా నటించడం వల్ల ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది’ అని పోస్ట్ చేశారు.