హీరోయిన్ అన్నాక అన్ని అలవాట్లు ఉంటాయి.. అనే మాటలు కామన్‌గా వింటూనే ఉంటాం. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ తమ అలవాట్ల గురించి ఓపెన్‌గా చెబుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు మద్యం సేవిస్తారా? అనే డౌట్స్ అందరిలోను ఉంటాయి. ఇదే విషయాన్ని శృతి హాసన్‌ని అడిగితే.. చాలా సింపుల్‌గా సమాధానం చెప్పేసింది. ఇంతకీ శృతి హాసన్ ఏం చెప్పింది?
లోక నాయకుడు కమల్ హాసన్ డాటర్‌గా కంటే.. హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్(Shruti Haasan). గబ్బర్ సింగ్ సినిమాతో సాలిడ్ బ్రేక్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్గా భారీ ఆఫర్స్ అందుకుంది. తెలుగుతో పాటు హిందీ మరియు తమిళంలో వరుసగా ఈ అమ్మడు సినిమాలు చేస్తూ దుసుకు పోతుంది. మధ్యలో కొన్నాళ్లు హెల్త్ ఇష్యూస్ కారణంగా.. సినిమాలకు దూరంగా ఉంది. కానీ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తు దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి సలార్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో శృతి హాసన్(Shruti Haasan) పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోనుంది. ఇక సినిమా విషయాల్ని పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను.. నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది శృతి. ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాతో తెగ షికార్లు చేస్తుంటుంది. ప్రస్తుతం అతనితో లివ్ ఇన్ రిలేషన్లో ఉంది. అతని గురించి ఏదో ఒకటి చెబుతునే ఉంటుంది అమ్మడు.
ఇక ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో తన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటుంది. తాజాగా చేసిన చిట్ చాట్‌లో ఓ నెటిజన్.. మీరు మద్యం తాగుతారా.. అని శృతి హాసన్‌ను ప్రశ్నించాడు. దానికి శృతి(Shruti Haasan) సింపుల్‌గా.. లేదు నేను మద్యం తాగను.. అలాగే ఎలాంటి మాదక ద్రవ్యాలను కూడా తీసుకోను.. అని బదులిచ్చింది. ఎంతో ఆనందంగా నా లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. నాకు అలాంటి అలవాట్లు లేవు.. అంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.