DivyaPrabha: విమానంలో వేధింపులు..ఫిర్యాదు చేసిన నటి
ఇటివల కాలంలో అమ్మాయిలకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పలువురు వేధింపులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మలయాళ నటి విమానంలో వేధింపులకు గురయ్యానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Divya Prbha: ప్రస్తుత రోజుల్లో ప్రతీ అమ్మాయి ఎక్కడో ఒకదగ్గర వేధింపులకు గురవుతున్న సంఘటనలు ఇటివల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిలు బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగే వచ్చే వరకు వారి పేరెంట్స్ కు భయాందోళన ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మలయాళ నటి దివ్య ప్రభ విమానంలో ప్రయాణిస్తుండగా వేధింపులకు గురైందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఓ పోస్ట్ చేసింది. ప్రియమైన మిత్రులారా.. నేను ముంబై నుంచి కొచ్చికి ఎయిర్ఇండియాలో ప్రయాణిస్తున్నప్పుడు నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్‌లో తన తోటి ప్రయాణికుడు తాగిన మత్తులో తనను వేధించాడని తెలిపింది.
Malayalam actress Divya Prabha has filed a police complaint after she was harassed by a drunk passenger on an Air India flight. "Despite reporting to the air hostess, the only action taken was relocating me to another seat, just before the takeoff," she wrote in a post. pic.twitter.com/g6hqD0AZ3T
ఇదే విషయాన్ని దివ్య ఎయిర్ హోస్ట్‌కు చెబితే..టేకాఫ్‌కు ముందు మాత్రమే ఆమె సీటు మార్చారు. కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొచ్చిన్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా ఈ సమస్యను ఎయిర్పోర్ట్ అధికారులకు తెలియజేస్తే..వాళ్లు ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసు సహాయ పోస్ట్‌కు వెళ్లమని మాత్రమే సలహా ఇచ్చారు. వాళ్లు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దివ్య తెలిపింది ఇక వెంటనే ఆమె ఈ విషయంపై దర్యాప్తు చేయమని కేరళ పోలీసులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. రయాణికుల భద్రత విషయంలో అధికారులు చర్యలు తీసుకునే విధంగా ప్రోత్సహిద్దామని తెలిపింది. ఈ విషయంలో తనకు మీ సపోర్ట్ కావాలని దివ్య పోస్ట్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యాన్ని చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.