»Dhanushs Captain Miller Movie Release Postponed Pongal 2024
Captain Miller: ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ వాయిదా
ధనుష్, అరుణ్ మాథేశ్వరన్ కాంబోలో వస్తున్న కెప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Dhanushs Captain Miller movie release postponed pongal 2024
తమిళ్ స్టార్ హీరో ధనుష్ యాక్ట్ చేసిన రాబోయే చిత్రం కెప్టెన్ మిల్లర్(Captain Miller) విడుదల తేదీ వాయిదా పడింది. ఈ సినిమాను డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజ్ చేయాల్సి ఉండగా..వచ్చే ఏడాదికి సంక్రాతికి వాయిదా వేశారు. కానీ ఖచ్చితమైన విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కెప్టెన్ మిల్లర్ మూవీ భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ డిసెంబర్ సీజన్లో అనిమల్, డుంకీ, సాలార్ వంటి అనేక పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో అత్యంత భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్ట్. ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజ్, అర్జున్ త్యాగరాజన్ ఈ యాక్షన్ డ్రామాని నిర్మించారు. శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, RRR ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్బ్లిక్ కూడా ఈ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. మరోవైపు దాదాపు ఐదు టాలీవుడ్ చిత్రాలు సంక్రాంతి 2024 విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో కెప్టెన్ మిల్లర్ కూడా ఈ జాబితాలో చేరడం విశేషం.