తమిళ స్టార్ హీరో కార్తి(Karthi) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'జపాన్' అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. ఆరంభం నుంచి సాలిడ్ బజ్ జనరేట్ చేసింది జపాన్. అందుకే వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒక్క అమెరికా(america)లోనే గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
జపాన్(Japan)..ఈ టైటిల్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేశాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తి. ఈ సినిమాలో జపాన్ ఎలాంటి దొంగ అంటే..ఏకంగా బంగారు పన్నునే పెట్టుకునేంత గజదొంగ.. అని ట్రైలర్‌తో చెప్పేశారు మేకర్స్. పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తి నుంచి వస్తున్న సినిమా కావడంతో.. జపాన్ పై భారీ అంచనాలున్నాయి. కార్తి కామెడీ టైమింగ్‌తో జపాన్ అదిరిపోతుందని.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చెబుతోంది. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 156 నిమిషాల రన్టైమ్తో నవంబర్ 10న థియేటర్లోకి రాబోతోంది జపాన్.
పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసిన కార్తి(Karthi)..ఈ సినిమాను భారీ ఎత్తున థియేటర్లోకి తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్లో జపాన్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. తమిళ, తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఉన్న అమెరికాలో దాదాపు 400కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ లెక్కన జపాన్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 9వ తేదీ నుంచి యూఎస్‌లో జపాన్ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. ఇక రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో..అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించగా..సునీల్, విజయ్ మిల్టన్, కెఎస్ రవికుమార్ కీలక పాత్రలో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మరి జపాన్‌తో కార్తి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.