కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్.. మన స్వీటి అనుష్క కోసం రంగంలోకి దిగాడు. అసలు స్వీటి సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులే అవుతోంది. అలాంటప్పుడు ధనుష్‌తో అనుష్క సినిమా చేయబోతోందా? అనే డౌట్స్ రాక మానదు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. ఒక్క అనుష్క కోసం మాత్రమే కాదు.. మన జాతిరత్నంతోను చిందులు వేయించేందుకు రెడీ అవుతున్నాడు ధనుష్.
నిశ్శబ్దం సినిమా(Nissambdam movie) తరువాత మరో సినిమా చేయలేదు అనుష్క(Anuska). లాంగ్ గ్యాప్ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా(Mis Shetty Mistar Polishetty)తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది స్వీటి. ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేం నవీన్ పోలిశెట్టితో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ లుక్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటిస్తుండగా.. అనుష్క చెఫ్ గా నటిస్తోంది. అసలు అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషనే హైలెట్ అంటే.. ఇప్పుడు వీళ్లకు తోడు కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా వచ్చేశాడు. ధనుష్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సింగర్ చాలా ఫేమస్ ధనుష్. ఇటీవల ధనుష్ చేసిన తెలుగు స్ట్రెయిట్ మూవీ ‘సార్’లో మాస్టారు మాస్టారు సాంగ్ పాడి.. కుర్రకారును ఫిదా చేశాడు.
ఇక ఇప్పుడు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీలో ధనుష్ ఓ పాట పాడుతున్నారని తెలుస్తోంది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈ పాట పాడనున్నారని సమాచారం. ఇప్పటికే రికార్డింగ్ కూడా అయిపోయిందట. సినిమాలో ఈ సాంగ్ స్పెషల్‌గా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ ఉంటుందని టాక్. ఖచ్చితంగా ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు మరింత వెయిట్ పెరిగినట్టే.