ఓ వైపు దేవర ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అయిందని వార్తలు వస్తుంటే, మరోవైపు బిజినెస్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో దేవర వాయిదా పడిందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. కానీ దేవర బిజినెస్‌ను క్లోజ్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్.
Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవర పై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా దేవర మూవీని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ చూసిన తర్వాత అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. అందుకే దేవర బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది. హంసిని ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ఏకంగా 27 కోట్లు పెట్టి దేవర ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.
ఎన్టీఆర్ కెరీర్లో ఇదే హైయెస్ట్ ఓవర్సీస్ డీల్ అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్‌తో దేవర వస్తోంది. అందుకే భారీ మొత్తంలో దేవర థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోతున్నాయి. తెలుగు రైట్స్ కోసం రెండు బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడుతున్నాయట. ఓవరాల్‌గా దేవర బిజినెస్ దాదాపు 150 నుంచి 200 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇకపోతే.. ఇప్పటికే దేవర ఆడియో రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్టుగా వార్తలొచ్చాయి. టీ సిరీస్ సంస్థ ఏకంగా 27 కోట్లకు సొంతం చేసుకుందని టాక్.
ఆడియో రైట్స్ పరంగా దేవరనే టాప్ అంటున్నారు. అలాగే దేవర పార్ట్ 1 ఓటిటి హక్కులకు నెట్‌ఫ్లిక్స్ రికార్డు రేట్ చెల్లించిదట. దేవరకున్న హైప్‌కు ఏకంగా 155 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న దేవర.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.