Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కెమెరాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం యాడ్స్, ప్రమోషన్స్ కూడా చేయడం లేదట. ఆమె ఇప్పుడు గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పూర్తిగా కెమెరా ప్రపంచానికి ఆమె దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీపికా, రణవీర్ సింగ్ దంపతులు ఈ సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు కానున్నట్లు తాజాగా ప్రకటించారు.
అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో దీపిక పదుకొనే(Deepika Padukone) ప్రగ్నెన్సీ నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభాస్‌తో ఆమె కలిసి నటించిన కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) సినిమా మే 9వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌కి రావడానికి కూడా దీపిక నో చెప్పేశారట. ఆమె ఇప్పుడు మూడు నెలల గర్భిణి కావడం వల్ల రెస్ట్ తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగానే దీపికపై ఎంతో కేరింగ్‌గా ఉండే రణవీర్(ranveer) ఇప్పుడు ఆమెపై ఇంకా ప్రేమను కురిపించేస్తున్నార్ట. దీపిక ఇప్పుడు ఎక్కువగా తన అత్త, అమ్మల దగ్గర ఉంటున్నారు. అక్కడ వారి పర్యవేక్షణలో రెస్ట్ తీసుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారట. అందుకనే ఆమె ప్రస్తుతం చిన్న చిన్న షూట్లకు కూడా అటెండ్ కావడం లేదు. ప్రమోషన్లకూ హాజరవడం లేదు.