TG: హైదరాబాద్లోని సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తమ తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థికసాయం అందించారు.