Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ నుంచి క్రేజీ అప్డేట్
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి అందరికీ తెలిసిందే. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి ఈ కుర్ర హీరో మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బైలింగ్యువల్ ప్రాజెక్ట్ విరూపాక్ష(Virupaksha) అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ విరూపాక్ష సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి అందరికీ తెలిసిందే. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి ఈ కుర్ర హీరో మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బైలింగ్యువల్ ప్రాజెక్ట్ విరూపాక్ష(Virupaksha) అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ విరూపాక్ష సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తీక్ దండు(Karthik Dandu) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
విరూపాక్ష మూవీ టైటిల్ గ్లింప్స్:
తాజాగా విరూపాక్ష(Virupaksha) సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ ను మేకర్స్ అందించారు. విరూపాక్ష(Virupaksha) ప్రపంచంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి, సుప్రీం హీరో విరూపాక్ష టీజర్ మార్చి 1వ తేదిన రిలీజ్(Teaser Release) కానుందంటూ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ”సార్” సినిమా హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) కథానాయికగా నటిస్తోంది. కాంతార సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అంజనీశ్ లోక్ నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
విరూపాక్ష(Virupaksha) సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ వంటివారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) ఈ సినిమా తర్వాత సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతం తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్నారు. ఇందలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.