Chandra Mohan: చంద్రమోహన్ కు తలకొరివి పెట్టిన వ్యక్తికి రూ.60కోట్లు
టాలీవుడ్లో ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వరుసగా పరిశ్రమకు చెందిన సీనియర్లు కన్ను మూస్తున్నారు. ఇటీవల సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ పరిశ్రమను విషాదంలో ముంచి వెళ్లిపోయారు.
Chandra Mohan: టాలీవుడ్లో ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వరుసగా పరిశ్రమకు చెందిన సీనియర్లు కన్ను మూస్తున్నారు. ఇటీవల సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ పరిశ్రమను విషాదంలో ముంచి వెళ్లిపోయారు. ఆయన వందల సినిమాల్లో నటించినా, చేతినిండా సంపాదించినా చివరి రోజుల్లో మాత్రం చాలా నిరాడంబరంగా గడిపారు. చంద్రమోహన్ ది చాలా లక్కీ హ్యాండ్ అని అంటారు. శోభన్ బాబు నుంచి ఇటు శ్రీదేవి, జయప్రద, జయసుధ వరకు ఎంతోమంది ఆయనను లక్కీ పర్సన్ అంటుంటారు. తనకు తాను కూడా లక్కీనే. ఇన్నేళ్ల కెరీర్లో ఆయన దాదాపు రూ. 300 కోట్ల ఆస్తులను సంపాదించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఆస్తి పంపకం విషయమై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
ఆయన వీలునామా రాశారని, దాని ప్రకారమే పంపకాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైన విషయం.. ఆయనకు తలకొరివి పెట్టిన వ్యక్తికి భారీ మొత్తంలో ఆస్తి ఇవ్వాలనుకున్నారట. వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం కూతుళ్లకు ఇవ్వాలని ఆయన రాశారట. అయితే తనకు తలకొరివి పెట్టిన వారికి ఆస్తిలో 20 శాతం ఇవ్వాలని ఉందట. అంటే దాదాపు 60 కోట్లు ఆయనకి తలకొరివి పెట్టిన వారికి దక్కుతుందట. సోమవారం ఆయన అంత్యక్రియలను చంద్రమోహన్ సోదరుడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించారు. దీంతో ఈ డబ్బు ఆయనకే చెందుతుందన్న ప్రచారం నడుస్తోంది. గుండె సంబంధిత వ్యాధితో శనివారం చంద్రమోహన్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను సోమవారం పంజగుట్ట స్మశానవాటికలో నిర్వహించారు.