»Army Recruitment Rally Aoc From January 1st To March 10th 2024 Hyderabad
Hyderabad:లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ..యువతకు మంచి ఛాన్స్
ఆర్మీలో చేరాలనుకునే యువతకు మంచి అవకాశం. ఎందుకంటే వచ్చే జనవరిలో హైదరాబాద్‌లో భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగనుంది. అందుకోసం డిసెంబర్ నెల నుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Army recruitment rally aoc from january 1st to march 10th 2024 hyderabad
భారత ఆర్మీలో చేరాలనుకునే వారి శుభవార్త వచ్చేసింది. అయితే ఈసారి హైదరాబాద్‌లోనే(hyderabad) ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ(Army recruitment rally) జరగనుంది. వివిధ కేటగిరీల నుంచి అగ్నివీర్ ఎన్రోల్మెంట్ కోసం యూనిట్ హెడ్‌క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జనవరి 1 నుంచి మార్చి 10, 2024 వరకు సికింద్రాబాద్‌లోని థాపర్ స్టేడియం, AOC సెంటర్లో మొదలుకానుంది. దీనిలో ఆర్మీ అధికారులు అగ్నివీర్ GD, టెక్ (AE), అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం 17 నుంచి 21 ఏళ్లు ఉన్న యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు స్పోర్ట్స్ ట్రయల్స్ కోసం డిసెంబర్ 29, 2023న ఉదయం 6 గంటలకు థాపర్ స్టేడియంలో రిపోర్ట్ చేయాలి.
అగ్నివీర్ GD (జనరల్ డ్యూటీ)
వయస్సు: 17½ నుంచి 21 సంవత్సరాలు
విద్యార్హత: 10వ తరగతి/మెట్రిక్ మొత్తం 45%, ప్రతి సబ్జెక్టులో 33% ఉత్తీర్ణత. చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత.
అగ్నివీర్ టెక్ (టెక్నికల్)
వయస్సు: 17½ నుంచి 21 సంవత్సరాలు
విద్యార్హత: 10+2/ఇంటర్మీడియట్ పరీక్షలో సైన్స్ (PCM & ఇంగ్లీష్) ఉత్తీర్ణత కనీసం 50%, ప్రతి సబ్జెక్టులో 40%, లేదా 50% మొత్తంతో 10వ/మెట్రిక్ ఉత్తీర్ణత. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్‌లో కనీసం 40% ఉత్తీర్ణత ITI నుంచి రెండు సంవత్సరాల సాంకేతిక శిక్షణ లేదా రెండు/మూడేళ్ళ డిప్లొమా.
అగ్నివీర్ Adm అసిస్టెంట్/SKT (AOC వార్డ్ మాత్రమే)
వయస్సు: 17½ నుంచి 21 సంవత్సరాలు
విద్యార్హత: 10+2/ఇంటర్మీడియట్ పరీక్షలో ఏదైనా స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత. మొత్తం 60% మార్కులతో ప్రతి సబ్జెక్టులో కనీసం 50%. 12వ తరగతిలో ఆంగ్లం, గణితం/ఖాతాలు/బుక్కీపింగ్లో 50% సాధించడం తప్పనిసరి.
అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ 10వ తరగతి (ఆర్టిసన్ మిస్క్ వర్క్స్, చెఫ్, స్టీవార్డ్)
వయస్సు: 17½ నుంచి 21 సంవత్సరాలు
విద్యార్హత: 10వ తరగతి సాధారణ ఉత్తీర్ణత (3%).
అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ 8వ తరగతి (హౌస్ కీపర్)
వయస్సు: 17½ నుంచి 21 సంవత్సరాలు
విద్యార్హత: 8వ తరగతి సాధారణ ఉత్తీర్ణత (33%).
అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ)
వయస్సు: 17½ నుంచి 21 సంవత్సరాలు
క్రీడల ట్రయల్: 29 డిసెంబర్ 2023
అర్హత: అథ్లెటిక్స్, స్విమ్మింగ్, డైవింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయి లేదా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం.
మరిన్ని వివరాలను కోరుకునే అభ్యర్థులు సికింద్రాబాద్ (TS) 500015లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని హెడ్‌క్వార్టర్స్ AOC సెంటర్‌ను సంప్రదించవచ్చు లేదా tuskercrc-2021@gov.in ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.