టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ ఎన్నో హిట్ సినిమాలకు కథలు అందించాడు. తాజాగా సినిమా స్టోరీలపై అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘కొన్ని సినిమాల స్టోరీలు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా.. బ్లాక్ బస్టర్ కాలేవు. గొప్ప సినిమా అవ్వాలంటే అందులో కచ్చితంగా ఎమోషన్ ఉండాలి. కనీసం ఒక్క హార్ట్ టచింగ్ సీన్ అయినా ఉండాలి. హిట్, బ్లాక్ బస్టర్కి మధ్య ఉన్న తేడానే ఎమోషన్.. లేదంటే ప్రజలు వెంటనే మర్చిపోతారు’ అని పేర్కొన్నాడు.