SKLM: జలుమూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్‌ను ఎంఈవో బమ్మిడి మాధవరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు, తప్పులు ఉన్న సరి చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ ఆధార్ ప్రత్యేక డ్రైవ్‌ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.