TG: హైకోర్టులో నటుడు మంచు మోహన్ బాబుకు చుక్కెదురైంది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా.. ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.