థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి(Saptagiri), వీజే సన్నీల మధ్య ప్రోమో షూట్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. వీజే సన్నీకి గాయమైంది. అయితే ఇది ప్రమోషనల్ స్టంటా? లేక నిజంగా ప్రమాదమా? అనేది తెలియాల్సి ఉంది.
బిగ్ బాస్ సీజన్5(Big Boss 5) విజేత వీజే సన్నీ(Vj Sunny) నటిస్తోన్ని తాజా చిత్రం అన్స్టాపబుల్(Unstoppable Movie). ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషనల్ షూటింగ్(Promotional Shooting) జరుగుతుండగా ప్రమాదం జరిగింది. థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి(Saptagiri), వీజే సన్నీలు ప్రోమో షూట్(Promo Shoot) చేస్తున్నారు. ఆ టైంలో పోలీస్ గెటప్ లో ఉన్న సప్తగిరి రివాల్వర్ చూపించే సీన్ జరుగుతుండగా అక్కడికి థర్టీ ఇయర్స్ పృథ్వి వచ్చాడు.
పృథ్వినీ అన్స్టాపబుల్ రిలీజ్ ఎప్పుడు అని అడగ్గా అక్కడే ఉన్న పృథ్వి తనకు ఏమీ తెలియదని సమాధానం చెబుతాడు. ఆ ఇద్దరి మధ్యలోకి వీజే సన్నీ(Vj Sunny) వస్తాడు. అప్పుడు సప్తగిరి వీజే సన్నీపై రివాల్వర్ ఎక్కుపెడుతాడు. సప్తగిరి కూడా అదే ప్రశ్న వేస్తాడు. సప్తగిరి(Saptagiri) చేతిలో ఉన్నటువంటి రివాల్వర్ పేలిపోతుంది. అందులో డమ్మీ బుల్లెట్ సన్నీ భుజంపై తాకగా వీజే సన్నీకి గాయమైంది. వీజే సన్నీ(VJ Sunny)కి గాయం అవ్వడంతో అన్స్టాపబుల్ చిత్ర యూనిట్ మొత్తం అలర్ట్ అయ్యారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది ప్రమోషనల్ స్టంటా? లేక నిజంగా ప్రమాదమా? అనేది తెలియాల్సి ఉంది.