2025 ఆస్కార్‌కు భారత్ నుంచి ‘లాపతా లేడీస్’ సినిమాను ఎంట్రీకి పంపనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆట్టం, యానిమల్ తదితర 29 సినిమాల జాబితా నుంచి ఈ సినిమాను ఎంచుకున్నట్లు చెప్పింది. ఈ సినిమాకి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావ్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ మూవీ ఆస్కార్‌కు వెళ్తుందనే నమ్మకముందని ఇటీవల కిరణ్‌రావ్ ఓ ఇంటర్య్వూలో తెలిపారు.