రాజకీయ బేధాలు ఏమీ లేకుండా అందరూ సరదాగా గడపాలని దత్తాత్రేయ పెట్టిన అలాయ్,భలాయ్ కార్యక్రమంలో బెడసికొట్టింది. ఈ కార్యక్రమంలో చిరు-గరికపాటిల మధ్య జరిగిన సంఘటన ముదిరిపాకాన పడింది. తన కార్యక్రమానికి ఆటంకం కలగడంతో అసహనం వ్యక్తం చేసిన గరికపాటి బాగానే ఉన్నారు… ఆయన మాటలను సరదాగా తీసుకున్న చిరంజీవి బాగానే ఉన్నారు.. కానీ.. దీనిపై స్పందించి నాగబాబు.. పెద్ద వివాదం చేశారు. ఇప్పుడు నాగబాబు చేసిన కామెంట్స్ పై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.
అసలు మ్యాటర్ లోకి వెళితే… అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఫోటో సెషన్ ఆపితే తాను ప్రసంగం మొదలుపెడతానంటే గరికపాటి మెగాస్టార్ చిరంజీవి పై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పట్ల గరికిపాటి చేసిన ఈ వ్యాఖ్యలకు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ గరికపాటి పేరు ప్రస్తావించకుండా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటేనని ట్వీట్ చేశారు.
ఈ విధంగా గరికపాటి పట్ల నాగబాబు చేసిన ట్వీట్ పై ఆలిండియా బ్రహ్మణ ఫేడరేషన్ ఉపాధ్యాక్షులు ద్రోణంరాజు రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈయన నాగబాబు పేరు ప్రస్తావించకుండా ఆహార్యానికి అవధానానికి తేడా తెలియని మాయారంగం, తరచూ తన ప్రవచనాలతో సమాచాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాదికి, సమాజంతో నటనా వ్యాపారం మాత్రమే తెలిసినటువంటి వ్యక్తిని చూసి అసూయ పడటం అంటే ఆకాశానికి ఉమ్ము వేసినట్టే అంటూ ఈయన తనదైన శైలిలో కౌంటర్ వేశారు.
ఇలా మెగాస్టార్ వల్ల చోటు చేసుకున్న ఈ వివాదం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. అయితే ఇప్పటికే మెగా ఫ్యాన్స్ గరికపాటి చేస్తున్న వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం చిరికిచిరికి గాలి వానల మారడం గమనార్హం. మరి దీనికి గరికపాటి కానీ.. చిరంజీవి కానీ స్పందిస్తే తప్ప వివాదం సద్దుమణగదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.