బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti chopra), ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా(Raghav Chadha) త్వరలో పెళ్లి బాజాలు మోగించబోతున్నారా? చాలా సందర్భాలలో వీరిద్దరూ కలిసి కనిపించిన క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల పరిణీతి చోప్రా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఆ క్రమంలో ఫొటో గ్రాఫర్లు ఆమెను పెళ్లి వార్త గురించి అడుగగా ఆమె నవ్వుకుంటూ వెళ్లిపోయింది.
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti chopra) నిజంగా ఆప్ ఎంపీని పెళ్లి చేసుకుంటుందా? ఆమె ఇటీవల ఆప్‌కి చెందిన రాఘవ్ చద్దా(Raghav Chadha)తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చిన క్రమంలో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల క్రితం వీరిద్దరు కలిసి ముంబయిలోని ఓ రెస్టారెంట్లో కనిపించిన క్రమంలో ఈ వార్తలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల పరిణీతి చోప్రా ముంబయి(mumbai) విమానాశ్రయంలో ఫొటోగ్రాఫర్లకు ఆకస్మాత్తుగా కనిపించింది. ఆ క్రమంలో ఆమెను AAP ఎంపీతో రిలేషన్ షిప్ గురించి వారు ప్రశ్నలను సంధించారు. కానీ పరిణీతి మాత్రం చక్కగా ఎవ్వరికీ ఏమి సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె మ్యాచ్ ప్యాంట్‌తో జత చేసిన భారీ బ్లాక్ బ్లేజర్‌ను ధరించి కనిపించింది. ఆమె బ్లేజర్ కింద తెల్లటి టాప్‌ని ధరించింది.
నటి కారు వద్దకు వెళ్లినప్పుడు, ఆమె పెళ్లి పుకార్ల గురించి అడిగినప్పుడు ఆమె తన కురులను సర్ధుకుంటు కనిపించింది. అంతేకాదు ఆ ప్రశ్నలు అడిగినప్పుడు ఆమె సిగ్గుతో నవ్వుతూ బయటకు వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఆమె కారులోకి ఎక్కిన తర్వాత ఫొటో గ్రాఫర్లకు బాయ్, గుడ్ నైట్ అంటూ చెప్పి వెళ్లిపోయింది. అయితే ఈ వీడియో చూసిన కొంత మంది తనకు ఇష్టం ఉంది కాబట్టి సమాధానం చెప్పడం లేదని అంటున్నారు. మరికొంత మంది అయితే ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు.
అయితే పరిణీతి చోప్రాను మాత్రమే కాదు. వీరిద్దరి పెళ్లి(marriage) గురించి పార్లమెంటు వెలుపల ఆప్ ఎంపీ చద్దా(aap mp Chadha)ను కూడా అడుగగా తనను రాజకీయాల గురించి ప్రశ్నలు అడగాలని.. పరిణీతి గురించి కాదని బదులిచ్చారు.
మరోవైపు మార్చి 28న AAP ఎంపీ సంజీవ్ అరోరా.. పరిణీతి, రాఘవ్ పుకార్లపై మొదట కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ట్విట్టర్లో వారిద్దరికీ సంజీవ్ మొదట శుభాకాంక్షలు తెలిపాడు. ఇద్దరి సోలో చిత్రాలను పంచుకుంటూ @raghav_chadha, @ParineetiChopraకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐక్యతతో ఉంటూ ప్రేమ, ఆనందంతో ఆశీర్వదించబడాలని ఆయన విశ్శేస్ తెలియజేశారు. అయితే ఈ అంశంపై పరిణితి, రాఘవ్ మాత్రం ఇంకా స్పందించలేదు.