»Varun Tej Reaction On Varun Tej Wedding Video Netflix Ott News
VarunTej పెళ్లి వీడియో OTT వార్తలపై వరణ్ తేజ్ రియాక్ట్
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వీరి పెళ్లి తర్వాత మరోసారి వార్తల్లో నిలిచారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన వరుణ్ తేజ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
Varun Tej Reaction On Varun Tej Wedding Video netflix OTT News
టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(lavanya tripathi) వెడ్డింగ్ గురించి ఇటివల ఓ వార్త సోషల్ మీడియాలోతెగ చక్కర్లు కోడుతుంది. వీరిద్దరి డెస్టినేషన్ మ్యారేజ్ నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా జరుగగా..అందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించారని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ జంట పెళ్లి వీడియో ప్రత్యేక హక్కులను కొనుగోలు చేసేందుకు ఈ OTT ప్లాట్‌ఫాం వారికి ఏకంగా 8 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించిందని పలు మీడియా ఛానెళ్లు రాసుకొచ్చాయి.
అయితే కొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కోడుతున్న ఈ వార్తలు కాస్తా హీరో వరుణ్ తేజ్ వరకు వెళ్లాయి. దీంతో ఆయన ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. #VarunLav #VarunTej & #LavanyaTripathiల పెళ్లికి సంబంధించి OTT హక్కులు అనేది లేనే లేవన్నారు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి వీటిలో నిజం లేదని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు ఇలాంటి పుకార్లను నమ్మొద్దని, ప్రచారం చేయొద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్లు తెలిపారు.
ఇటివల వరుణ్ తేజ్ కొణిదెల, అతని ప్రియురాలు లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీతోపాటు వరుణ్, లావణ్యల సన్నిహితులు కూడా హాజరయ్యారు. అంతేకాదు ఇటలీలో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య ఇటీవల ఇటివల హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ పార్టీని కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఈ జంట ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత జూన్ 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు.