BiggBoss7: తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో (BiggBoss7) మరో సరికొత్త సీజన్‌తో మన ముందుకు రావడానికి రెడీ అవుతోంది. గత ఐదు సీజన్లు బాగానే ఆకట్టుకున్నా, ఆరో సీజన్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ సీజన్ చాలా చప్పగా సాగిందని నెటిజన్లు విపరీతంగా విమర్శలు చేశారు.
ఏ సీజన్‌కీ లేనంత దారుణంగా రేటింగ్ పడిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఏడో సీజన్‌కి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. ఈ సీజన్ మరింత కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గత సీజన్లో జరిగినట్లుగా కాకుండా ఈ సారి టీమ్ మరింత జాగ్రత్తగా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో సరికొత్త కండిషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్లో ముందుగా వెళ్లిన కంటెస్టెంట్స్‌తోపాటు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఈ సారి మాత్రం అలా వైల్డ్ కార్డు అనే కాన్సెప్ట్ లేకుండా చేస్తున్నారట.
టాస్క్‌లు గతంలోవి రిపీట్ కాకుండా, ఈ సారి కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఈ సీజన్లో చాలా మంది ఇంట్రెస్టింగ్ పర్సన్స్‌ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈటీవీ ప్రభాకర్, యూట్యూబ్ ఫేమ్ యాంకర్ నిఖిల్, సింగర్ మోహన భోగరాజు, ఢీ కొరియోగ్రాఫర్ పండు, టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు ఆయన భార్య కూడా వస్తున్నారట. మరికొందరి పేర్లు కూడా వినపడుతున్నాయి. ఈ సారి గ్లామర్ డోస్ ఎక్కువగా పెంచాలని చూస్తున్నారట. సీజన్లో అందమైన అమ్మాయిలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది.
షో మొదలైతే తప్ప, ఎవరెవరు వస్తారు అనే విషయం తేలనుంది. బిగ్ బాస్ ఓటీటీలో సందడి చేసిన కొందరు సైతం మళ్లీ ఈ బిగ్ బాస్ 7లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీజన్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రసారం అయ్యే అవకాశం ఉంది.