BIG B Amitabh Bachchan Reaches Work Location Via Byker Lift
Amitabh:దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇంటి నుంచి బయల్దేరి ఆఫీసుకు చేరుకోవాలంటే తంటాలు పడాల్సిందే. ఇందుకు సెలబ్రిటీలు ఏమీ మినహాయింపు కాదు. షూటింగ్ స్పాట్‌కు చేరుకునేందుకు సినీ ప్రముఖులు పడే ఇబ్బందులు ఎక్కువే. ఇలాంటి సమస్యను బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh) నిన్న ఫేస్ చేశారు.
ఇంతలో ఆయనకు ఓ బైకర్ సాయం చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న బిగ్ బీని బైక్ మీద షూటింగ్ స్పాట్ వద్దకు తీసుకెళ్లాడు. దీంతో సమయానికి అమితాబ్ (Amitabh) చేరుకున్నాడు. తర్వాత అమితాబ్ (Amitabh) ఇన్ స్టలో థాంక్స్ చెప్పారు. ‘బైక్ మీద తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు.. ఎవరో తెలియదని.. సమయానికి షూటింగ్ వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. వేగంగా తీసుకెళ్లడంతో తాను టైమ్‌కు చేరుకున్నా’ అని తెలిపారు.
లిప్ట్ ఇచ్చిన వ్యక్తి పేరు తెలియనందున క్యాప్, షార్ట్, యెల్లో టీ షర్ట్ వేసుకున్న మీకు థాంక్స్ అని చెప్పారు. ఈ పోస్ట్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘భూమిపై మీరు ప్రశాంతమైన వ్యక్తి.. అమిత్ జీ లవ్ యూ’ అని అమితాబ్ (Amitabh) మనమరాలు రీ ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా స్పందించారు.
నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇద్దరిలో ఒక్కరికీ హెల్మెట్ (helmet) లేదని ఒకరు ప్రస్తావించారు. మరొకరు హెల్మెట్ ధరించడం గురించి ఏమంటారు..? మీ పని చేసే చోటుకు ఇచ్చిన ప్రాధాన్యం హెల్మెట్‌కు ఇవ్వరా అని అడిగారు. ఇలా అమితాబ్‌ను నెటిజన్లు తప్పుపట్టారు. అయినప్పటికీ ఫోటో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.