CSK CEO Kashi Vishwanath Confirm Dhoni Will Play Next IPL Season
CSK CEO:మహేంద్ర సింగ్ ధోని (dhoni) ఐపీఎల్‌కు (ipl) ఎప్పుడు గుడ్ బై చెబుతారు..? ఇదే ప్రశ్న రిపీట్ అవుతుంటుంది. వయస్సు దృష్ట్యా.. ఆటలో చురుకుదనం తగ్గిందనో ఏమో కానీ.. కామెంటేటర్ల నుంచి ఇదే ప్రశ్న వస్తోంది. దీంతో ధోని (dhoni) నొచ్చుకున్నాడో ఏమో.. నిన్న మ్యాచ్ జరిగిన తర్వాత చెపాక్ స్టేడియంలో కలియ తిరిగాడు. అభిమానులకు (fans) షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ధోని సడెన్‌గా ఇలా చేయడం చర్చకు దారితీసింది.
ధోని (dhoni) ఐపీఎల్ లాస్ట్ సీజన్ ఇదేనా అనే సందేహాం కలిగింది. అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీంతో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ (kasi vishwanath) లైన్లోకి వచ్చారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో కూడా ధోని ఆడతారు.. ఆడతారని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పటిలాగే అభిమానులు (fans) తమకు మద్దతు తెలుపుతారని అనుకుంటున్నా అని కామెంట్ చేశారు.
సీఎస్కే సీఈవో సమాధానం చెప్పడంతో అభిమానులు కూల్ అయ్యారు. ధోని (dhoni) రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండదని అనుకుంటున్నారు. చెన్నై (chennai) జట్టు యజమాన్యానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు.
వాస్తవానికి ధోని (dhoni) వయస్సు ఎక్కువే.. ఫీల్డ్‌లో కీపింగ్ చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఓ మ్యాచ్‌లో పడి లేచి.. లెవలేకపోయారు. మరొకరు చేయి ఇస్తే.. నిలబడ్డారు. అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూమర్స్ రాగా.. చెన్నై జట్టు యజమాన్యం అదేం లేదని కొట్టిపారేసింది.