మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కలిసి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరుకి చెల్లిగా మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తుండగా ఆమెకు జోడీగా అక్కినేని హీరో సుశాంత్(Hero sushanth) కనిపిస్తున్నాడు. ప్రస్తుతం భోళాశంకర్ మూవీ(Bhola shankar Movie) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.
భోళా శంకర్ సెకండ్ సింగిల్ ప్రోమో:
భోళాశంకర్ మూవీ(Bhola shankar Movie) నుంచి ఇప్పటికే ఒక సాంగ్ ని రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ‘జాం జాం జజ్జనక’ అనే సాగే పార్టీ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్(Promo Release) చేశారు. ఈ పాటలో చిరు, తమన్నా, కీర్తి, సుశాంత్ అదిరిపోయే స్టెప్పులేశారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ ని డిజైన్ చేశారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. పూర్తి సాంగ్ ని జులై 11న సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ మూవీ(Bhola shankar Movie)ని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పూర్తి చేశాడు. ఈ మధ్యనే ఈ మూవీ టీజర్(Teaser) కూడా రిలీజ్ అయ్యింది. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరు ఈ మూవీతో మరోసారి సక్సెస్ అందుకోనున్నాడు.