నిర్మాత బెల్లంకొండ సురేష్ (Producer Bellamkonda Suresh) తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) హీరోగా నటించిన, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో (Director Boyapati Srinu) వచ్చిన జయ జానకి నాయక సినిమా (Jaya Janaki Nayaka film) యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ వర్షన్ ను ఉత్తరాది భారతీయులు బాగా చూస్తున్నారట. ఇప్పటి వరకు ఈ సినిమాకు 709 మిలియన్లు అంటే 70.9 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ప్రపంచంలోనే 709 మిలియన్ వ్యూస్ దాటిన మొదటి సినిమాగా నిలిచింది. కేజీఎఫ్ (KGF) సినిమాకు 702 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
తెలుగు జయ జానకి నాయక 2017 లో విడుదలైంది. ఇది యాక్షన్ ప్రేమకథా చిత్రం.ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు. హిందీలో ఈ సినిమాను జయ జానకి నాయక ఖూంకార్ (Jaya Janaki Nayaka Khoonkar)తో తీసుకు వచ్చారు. పెన్ మూవీస్ (Pen Movies) విడుదల చేసింది. ఈ మూవీ 2018 ఫిబ్రవరి నెలలో యూట్యూబ్ లోకి వచ్చింది. దక్షిణాది సినిమాలు చాలా వరకు హిందీలోకి డబ్ చేస్తున్నారు. ఇవి ఉత్తరాదిన మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి. ఈ సినిమా హిందీ వర్షన్ (Hindi version) కరోనా లాక్ డౌన్ (Covid 19 lock down) సమయంలో ఎక్కువ వ్యూయర్ షిప్ ను దక్కించుకున్నది.