»Baby Makers New Movie With Anand Deverakonda And Vaishnavi Chaitanya Shooting Start Hyderabad
Baby Makers: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో బేబీ మేకర్స్ కొత్త చిత్రం
బేబీ, కలర్ ఫోటో మేకర్స్ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ మేరకు వెల్లడించారు.
Baby Makers new movie with Anand Deverakonda and Vaishnavi Chaitanya shooting start hyderabad
సాయి రాజేష్ డైరెక్షన్ చేసిన బేబీ(baby) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కేవలం 8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రంతో నటీనటులు వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), విరాజ్ అశ్విన్లకు మంచి గుర్తింపు దక్కింది. ఈ బేబీ క్రేజీ కాంబో ఇప్పుడు మళ్లీ రాబోతుంది. బేబీ నిర్మాతలు, మాస్ మూవీ మేకర్స్, ఆనంది ఆర్ట్స్ ఆఫ్ కలర్ ఫోటోస్ సమక్షంలో మరో రొమాంటిక్ డ్రామాతో రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ పోస్టర్ను రిలీజ్ చేసి ఈ మేరకు ప్రకటించారు. ఆ పోస్టర్లో ఆనంద్ దేవరకొండ వైష్ణవిని రొమాంటిక్ పద్ధతిలో పట్టుకున్నట్లు చూపించారు. ఫస్ట్ లుక్ బ్లాక్ అండ్ వైట్లో చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
After CULT BLOCKBUSTER #Babythemovie our combo is back again with another wonderful story written by Sai Rajesh @MassMovieMakers
Is Happy to collaborate with National award winning production house @AmruthaProd me and Sai Rajesh producing this
With our beautiful & talented pair… pic.twitter.com/h3oemVr2zZ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. స్క్రిప్ట్ రాసిన సాయి రాజేష్(sai rajesh)తో కలిసి SKN ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈసారి రొమాంటిక్ డ్రామాకు దర్శకత్వం వహించే రాజ్ నంబూరికి దర్శకత్వం బాధ్యతలను సాయి రాజేష్ అప్పగించారు. బేబీతో చార్ట్బస్టర్స్ను అందించిన విజయ్ దుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మరికొన్ని రోజుల్లో ఖరారు కానుంది.