Avatar Movie Director : అవతార్ డైరెక్టర్ షాకింగ్ రెమ్యూనరేషన్.. 10 సినిమాలు తీయొచ్చు!
Avatar Movie Director జేమ్స్ కామెరాన్ అవతార్ సృష్టి గురించి అందరికీ తెలిసిందే. 2009లో అవతార్ అనే సరికొత్త వరల్డ్ క్రియేట్ చేసి.. సంచలనం సృష్టించాడు జేమ్స్. పండోరా అనే సరికొత్త గ్రహం పైకి తీసుకెళ్లాడు.
Avatar Movie Director జేమ్స్ కామెరాన్ అవతార్ సృష్టి గురించి అందరికీ తెలిసిందే. 2009లో అవతార్ అనే సరికొత్త వరల్డ్ క్రియేట్ చేసి.. సంచలనం సృష్టించాడు జేమ్స్. పండోరా అనే సరికొత్త గ్రహం పైకి తీసుకెళ్లాడు. దాంతో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు చేసింది అవతార్. ఇక దాదాపు 13 ఏళ్ల తర్వాత వచ్చిన అవతార్ 2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. కాకపోతే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో గతేడాది డిసెంబర్ 16న రిలీజైన ఈ మూవీ.. భారీ వసూళ్లను అందుకుంది. ఇందులో అండర్ వాటర్ విజువల్స్‌ను చూపించాడు. అయితే సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. 2.22 బిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. దాంతో ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులో మూడోస్థానంలో నిలిచింది. అయితే ఇప్పటి వరకు అవతార్ కలెక్షన్స్, రికార్డుల గురించే మాట్లాడుకున్నారు. కానీ ఆ రికార్డు సృష్టికర్త జేమ్స్ కామెరాన్ రెమ్యూనరేషన్ గురించి చాలామందికి తెలియదు. కానీ తాజాగా అవతార్ 2తో కామెరాన్ పొందిన రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే. అవతార్ మూవీ లాభాల్లో కేమరూన్‌కు వాటా ఉంది. దాంతో ఏకంగా 9.5 కోట్ల డాలర్లు అందుకున్నాడట. అంటే మన కరెన్సీలో సుమారు రూ.786 కోట్లు అన్న మాట. దీంతో 2022లో హెయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న డైరెక్టర్ల లిస్టులో కామెరాన్ టాప్ ప్లేస్‌లో నిలిచాడనే చెప్పాలి. అయితే జేమ్స్ కామెరాన్ పారితోషికం చూస్తే.. తెలుగులో యావరేజ్ బడ్జెట్‌తో పది సినిమాలు తీయొచ్చు. ఏదేమైనా జేమ్స్ కామెరాన్ అంటే.. ఆ మాత్రం ఉంటది మరి!