Charmi Kaur : ఏంటి.. చార్మి అంత చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిందా !
భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన నీతోడు కావాలి సినిమా ద్వారా చార్మి కౌర్ తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. 2002, మార్చి 28న విడుదలైన ఈ సినిమాలో అర్జున్ సర్జా హీరోగా నటించారు. తొలి సినిమా ప్లాప్ కావడం, తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా చార్మికి గుర్తింపు రాలేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తీసిన శ్రీ ఆంజనేయంతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది.
Charmi Kaur : భీమినేని శ్రీనివాసరావు(Bhimineni Srinivasa Rao) దర్శకత్వం వహించిన నీతోడు కావాలి సినిమా ద్వారా చార్మి కౌర్(Charmi Kaur) తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. 2002, మార్చి 28న విడుదలైన ప్లాప్ కావడం, తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా చార్మికి గుర్తింపు రాలేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ(krishna vamshi) తీసిన శ్రీ ఆంజనేయంతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఆ చిత్రంలో చార్మి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చార్మి అంటే తెలియని వారుండరు. స్టార్ హీరోలందితో నటించారు చార్మి. ఆమె సినిమా కెరీర్ చాలా సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి వరుసగా సినిమాలను నిర్మిస్తుంది.
వయసు చకచక పెరుగుతూ నాలుగు పదులకు చేరువైన చార్మి అందం ఏమాత్రం తగ్గలేదు. నిర్మాతగా మారిన తర్వాత చార్మి సినిమాల్లో నటించడం మానేసింది. పూరికి చేదోడు వాదోడుగా ప్రొడక్షన్ పనులు చూసుకుంటుంది. ఇకపోతే సినీ రంగ ప్రవేశం అనుకోకుండా అలా జరిగిపోయిందట. ఒక రోజు ముంబైలో ఛార్మిని చూసిన ఒక సినిమా వ్యక్తి సినిమాల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపించాడట. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులను సంప్రదించగా అప్పటికి ఛార్మి వయసు కేవలం 14 సంవత్సరాలు అని, ఆమె తల్లిదండ్రులు మరి కొన్నాళ్ల తర్వాత సినిమాల్లో చేయిస్తామంటూ మాట ఇచ్చారట. ఆ తర్వాత ఛార్మి పేరెంట్స్ కొన్ని కండిషన్స్ మధ్య కూతురుని సినిమాలో నటింపజేశారు. చదువుకుంటున్న ఛార్మి సెలవు రోజుల్లో మాత్రమే షూటింగ్ కి హాజరు అవుతుందని, షూటింగ్ సమయంలో మాత్రమే తాను సెట్ లో ఉంటామని ఆమె తల్లిదండ్రులు కండిషన్ పెట్టి మరీ మొదటి సినిమా చేయించారట. అలా 14 సంవత్సరాల వయసులో ఛార్మి హీరోయిన్ గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంట్రీ ఇస్తుండగా ఛార్మి అంత పిన్నవయసులో చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది.