»Another Star Heroine Deep Fake Photo Viral Katrina Kaif
Katrina kaif: రష్మిక లాగే మరో స్టార్ హీరోయిన్ బలి!
స్టార్ బ్యూటీ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫేక్ వీడియో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెద్ద చర్చకు దారితీసింది. అయితే రష్మిక లాగే తాజాగా మరో స్టార్ హీరోయిన్ మార్ఫింగ్‌కు గురైంది.
Another star heroine deep fake photo viral katrina kaif
బ్రిటీష్-ఇండియన్ సోషల్ మీడియా పర్సనాలిటీ జారా పటేల్ ఒరిజినల్ వీడియోని.. కొందరు రష్మిక(rashmika) ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వ్యవహారం పై ఇప్పటికే చాలామంది ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. ముందుగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించింది. ‘మార్ఫింగ్ అత్యంత ప్రమాదకరమైన చర్య. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలను గుర్తిస్తే, వాటిని 36 గంటల్లో తొలగించాలి. ఈ నేరం చేసిన దోషుల్నీ, సదరు సామాజిక మాధ్యమాలను రూల్ 7 కింద కోర్టుకు లాగొచ్చు. ఈ వ్యవహా రంపై కేంద్ర సీరియస్‌గా ఉంది’ అని తెలియజేశారు.
ఇక రష్మిక.. ‘నేను చదువుకునే రోజుల్లో ఇలాంటివి జరిగి ఉంటే..ఎలా తట్టుకునేదాన్నో అని ఊహిస్తేనే భయంగా ఉంది..’ అంటూ భయపడిపోయింది. అలాగే.. రష్మిక ఫేక్ వీడియోపై నాగచైతన్య స్పందించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి.. అని అన్నారు. అయితే.. ఓ వైపు రష్మిక ఫేక్ వీడియో పై ఇంత రచ్చ జరుగుతుంటే, మరోవైపు కత్రినా కైఫ్ ఫోటోను కూడా మార్ఫింగ్ చేశారు. ప్రస్తుతం కత్రినా కైఫ్(katrina kaif), సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్ 3 మూవీ నటిస్తోంది. ఈ సినిమాలో కత్రినా చేసిన టవల్ ఫైట్ ట్రైలర్లో హైలెట్‌గా నిలిచింది. రీసెంట్గా ఆ ఫైట్‌ను ఎలా షూట్ చేశారో చెబుతూ.. ఓ స్టిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు అదే ఫోటోని ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసేశారు. డీప్‌ఫేక్ ఫొటోల్లో కత్రినా లోదుస్తుల్లో ఫైట్ చేస్తున్నట్లుగా చూపించారు. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లోను హాట్ టాపిక్‌గా మారింది.