అనిమల్ సినిమాతో అసలు సిసలైన వైలెన్స్ చూపిస్తానని చెప్పిన సందీప్ రెడ్డి వంగ.. చెప్పినట్టే చేశాడు. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది అనిమల్. తాజాగా అనిమల్ ఓటిటి డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది.
Animal: అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదల అయింది. అందుకు తగ్గట్టే భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్లో దుమ్ములేపిన అనిమల్ ఓటిటి వెర్షన్ కోసం డిజిటల్ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా థియేటర్ వెర్షన్ రన్ టైం మూడు గంటల 21 నిమిషాలు ఉండగా.. ఓటిటి వెర్షన్ మరింత లాంగ్ రన్ టైంతో వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ఎలాంటి కట్స్ లేకుండా అనిమల్ డిజిటల్ ఎంట్రీ ఇస్తే.. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన వారు కూడా ఓటిటిలో ఈ సినిమాను చూడడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ముందు నుంచి ఈ సినిమా సంక్రాంతికి ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ఒకవేళ సంక్రాంతికి కుదరకపోతే.. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానున్నట్టు బీ టౌన్ వర్గాల సమాచారం. కానీ ఇప్పుడు అనిమల్ సంక్రాంతికే ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Tsunami: భారత్‌కు సునామీ ముప్పు.. అసలు విషయం ఇదే
జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ఓటిటిలో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తుంది. ‘అనిమల్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందీ ఓటిటి రూల్ ప్రకారం.. సినిమా విడుదలైన ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది అనిమల్. కాబట్టి.. సంక్రాంతికి అనిమల్ ఓటిటిలోకి రావడం పక్కా అంటున్నారు.