SRPT: నడిగూడెం గ్రామానికి చెందిన పాషా అనే లారీ డ్రైవర్ శుక్రవారం తెల్లవారుజామున కోదాడ పట్టణంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జీవన ఉపాధి కోసం కోదాడలో నివాసం ఉంటున్న ఈ కుటుంబం సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.