»Animal Director Sandeep Reddy Vanga Is Ready To Give Kangana Ranaut A Chance
Sandeep Reddy Vanga: నీకు కూడా ఛాన్స్ ఇస్తా.. సందీప్ రెడ్డినా మజాకా
అర్జున్ రెడ్డి తర్వాత 'అనిమల్' సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు భారీ వసూళ్లతో పాటు.. చాలా విమర్శలు కూడా వచ్చాయి. దీంతో సందీప్ ఇచ్చే కౌంటర్ మామూలుగా ఉండడం లేదు.
Animal director Sandeep Reddy Vanga is ready to give Kangana Ranaut a chance
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ‘అనిమల్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. గతేడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా.. లేట్‌గా ఓటిటిలో వచ్చి ఇక్కడ కూడా సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన అనిమల్.. ఓటిటిలో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే.. ఈ సినిమాకు కలెక్షన్స్ ఏ రేంజ్లో వచ్చాయో.. అంతకుమించి విమర్శకలు కూడా వచ్చాయి. రచయిత జావేద్ అక్తర్ సైతం ఇలాంటి సినిమాలను ప్రమాదకరం అని అన్నారు. దీనికి కౌంటర్‌గా అక్తర్ తన సినిమాపై వేళ్లు చూపించే ముందు.. తన కొడుకు ఫర్హాన్ అక్తర్ చేసే కంటెంట్‌ను కూడా పర్యవేక్షించాలని కోరారు. మీర్జాపూర్‌ని నిర్మిస్తున్నప్పుడు ఇదే విషయాన్ని తన కుమారుడు ఫర్హాన్ అక్తర్‌కి ఎందుకు చెప్పలేదు.? అని ప్రశ్నించారు. అలాగే.. బాలీవుడ్ హాట్ క్వీన్ కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ పై కూడా రెస్పాండ్ అయ్యాడు. ఇటీవల అనిమల్ మూవీపై కంగనా నెగిటివ్ కామెంట్స్ చేసింది. దీంతో సందీప్ మాట్లాడుతూ.. కంగనాతో కలిసి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఔననే సమాధానం ఇచ్చాడు.
‘అవకాశం వచ్చి ఆమె ఆ పాత్రకు సరిపోతుందని అనిపిస్తే.. నేను వెళ్లి ఆమెకు కథ చెబుతాను. నిజం చెప్పాలంటే.. ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. కంగనా నటించిన క్వీన్ చూశాను. ఆమె యాక్టింగ్ బాగుంటుంది. అనిమల్పై కంగనా చేసిన నెగెటివ్ కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోను..’ అని చెప్పుకొచ్చాడు. అంటే.. ఇండైరెక్ట్‌గా కంగనకు కూడా ఛాన్స్ ఇస్తానని చెప్పేవాడు సందీప్. అయితే.. సందీప్ కామెంట్స్ పై మళ్లీ రెస్పాండ్ అయింది కంగనా. ‘రివ్యూలు, విమర్శలు ఒకటి కాదు. అవి ఒకేలా ఉండవు. నా రివ్యూపై సందీప్ నవ్వుతూ ఇచ్చిన గౌరవాన్ని చూశాను. దయచేసి నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి.. లేకపోతే మీ ఆల్ఫా మగ హీరోలు స్త్రీవాదులు అవుతారు.. అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా.. సందీప్ మాత్రం తనను విమర్శించిన వారిని మాత్రం గట్టిగానే ఏసుకుంటున్నాడనే చెప్పాలి.