జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా పాపులర్ అయిన అనసూయ(Anasuya) సినిమాల్లోని తన అందం, నటనతో క్రేజ్ పొందింది. బుల్లితెరపై గ్లామర్ టచ్ ఇచ్చి ఇప్పుడు వెండితెరపై కూడా రెచ్చిపోతోంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం విమానం(Vimanam Movie). ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి శివ ప్రసాద్ యానాల(Shiva Prasad Yanala) డైరెక్షన్ చేశారు.
విమానం సినిమా(Vimanam Movie)లో సుమతి పాత్ర(Sumathi Character)లో అనసూయ(Anasuya) ఒదిగిపోయింది. ఆమె క్యారెక్టర్ పై సాగే పాట(Song)ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది. ”సుమతీ..సుమతీ..నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత” అంటూ సాంగ్ సాగుతుంది. ఈ సినిమాకు చరణ్ అర్జున్(Charan Arjun) సంగీతం అందిస్తున్నారు.
సుమతీ సాంగ్ (sumathi Song)కు చరణ్ అర్జున్ సాహిత్యం అందించారు. పాటను ఆయనే పాడారు. విమానం మూవీ(Vimanam Movie)లో సముద్రఖని(Samudrakhani) కీలక పాత్రలో కనిపించనున్నారు. జూన్ 9వ తేదిన ఈ మూవీని విడుదల(Release) చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో సుమతి పాత్ర హైటెల్ గా నిలువనుంది.