అల్లు బ్రాండ్‌తో వచ్చినా కూడా హీరోగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు అల్లు శిరీష్. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త స్పీడ్‌గా సినిమాలు చేసిన శిరీష్.. మధ్యలో దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఇటీవలె 'ఊర్వసివో రాక్షసివో' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అలాగే ఓ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో కూడా పడిపోయినట్టు టాక్. అల్లు అరవింద్ వారించిన కూడా శిరీష్ మాట వినడం లేదట.
ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్, ఎఫైర్స్ కామన్. కొందరు ఘాడంగా ప్రేమించుకొని విడిపోయిన వాళ్లు ఉన్నారు.. పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. రీసెంట్‌గానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి పీఠలెక్కబోతున్నారు. ఇక ఇప్పుడు అల్లు శిరీష్ కూడా హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్టు.. ఇండస్ట్రీ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. గీత ఆర్ట్స్-2 బ్యానర్ పై లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో.. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది.
ఇద్దరు రియల్ లవర్స్లాగే రొమాంటిక్ సీన్స్‌తో ఇద్దరు రెచ్చిపోయారు. ఈ సినిమా నుంచే ఇద్దరు ప్రేమలో ఉన్నారనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. ఈ విషయం అల్లు అరవింద్‌కు తెలిసిందని.. అల్లు శిరీష్‌ని వారించాడనే న్యూస్ కూడా ఆ మధ్య స్ప్రెడ్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా అల్లు శిరీష్ తన ప్రేమను ఇంట్లో ఒప్పుకొలేదని.. ఇంటికి దూరంగా ఉంటున్నారని అంటున్నారు.
ఏదేమైనా పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటాను అని అల్లు శిరీష్ మొండికేసి కూర్చున్నాడట. దాంతో చేసేది లేక అల్లు అరవింద్ కూడా వీరి పెళ్లికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఎంగేజ్మెంట్ ఉంటుందని.. ఆ తర్వాత పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.