పుష్ప మూవీలో.. రఫ్ గడ్డంతో ఊరమాస్‌గా దుమ్ముదులిపాడు బన్నీ. పుష్పరాజ్ మాసివ్ లుక్కు ఫిదా అయ్యారు ఆడియెన్స్. అందుకే పుష్ప2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు. ఈ క్రమంలో పుష్పరాజ్ లుక్ గురించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. సుకుమార్-అల్లు అర్జున్‌లది డెడ్లీ కాంబినేషన్. ఇద్దరి కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దాంతో హ్యాట్రిక్ ఫిల్మ్ పుష్పతో పాన్ ఇండియాను షేక్ చేశారు ఇద్దరు. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ మ్యానరిజమ్.. తగ్గేదేలే అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతునే ఉంది.
అంతేకాదు తాజాగా ఈ సినిమా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నది. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో.. బ్లాక్‌బస్టర్ హిట్స్ ఎరౌండ్ ది వరల్డ్ కేటగిరీలో.. ఆగస్ట్ 30న ఈ సినిమా స్క్రీనింగ్ జరిగింది. ఈ ఏడాదిలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు సినిమాగా పుష్ప నిలిచింది. ఇకపోతే.. రీసెంట్గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న పుష్ప2.. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో.. పుష్ప లుక్ గురించి ఓ న్యూస్ వినిపిస్తోంది. పుష్ప పార్ట్ వన్‌లో గుబురు గడ్డంతో కాస్త లాంగ్ హెయిర్‌తో కనిపించిన అల్లు అర్జున్.. ఇందులో కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. గడ్డం కాస్త తగ్గించి.. ట్రిమ్మింగ్ లుక్‌లో కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి.. సిండికేట్ నాయకుడిగా ఎదిగిన పుష్పరాజ్.. ఇప్పుడు రూలింగ్ చేయబోతున్నాడు. అందుకే బన్నీ లుక్ చేంజ్ అవనుందని తెలుస్తోంది. మరి పుష్ప2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.