Mega Princess Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకారకు (Klin Kaara) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) కాస్ట్లీ గిప్ట్ అందజేశారు. క్లీంకారకు గోల్డ్ స్లెట్ అందజేశారని విశ్వసనీయ సమాచారం. ఆ పలక మీద క్లీంకార పుట్టిన తేదీ, సమయం, ఆమెకు ఆ పేరుని ఎలా పెట్టారనే వివరాలను డిజైన్ చేయించారట. నిజంగా స్లెట్ అందజేశారా..? లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
మెగా ఫ్యామిలీలోకి ప్రిన్సెస్ (princess) రావడంతో అందరూ గిప్ట్స్ పంపిస్తున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ (ntr) స్పెషల్‌గా డిజైన్ చేసిన బంగారు డాలర్స్‌ను క్లీంకారకు గిప్ట్గా పంపించారు. జూన్ 20వ తేదీన క్లీంకార (Klin Kaara) జన్మించింది. లలితా సహస్రనామం నుంచి స్ఫూర్తి పొంది క్లీంకార (Klin Kaara) అనే పేరు పెట్టారు. రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పెళ్లైన 11 ఏళ్లకు క్లీంకార జన్మించింది. ఆడపిల్ల.. మంగళవారం రోజున జన్మించడంతో మెగా ఫ్యామిలీలో ఆనందానికి అవధి లేకుండా పోయింది. మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు.. తన మనవరాలు ఆంజనేయ స్వామికి ఇష్టమైన వారం మంగళవారం రోజున జన్మించింది.