ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun) పుష్ఫ2 సినిమా(Pushpa 2 Movie) షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తాజాగా బన్నీ కూతురు అల్లు అర్హ(Allu arha) వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. శాకుంతలం సినిమా(Shaakuntalam Movie) తర్వాత అల్లు అర్హకు క్రేజ్ పెరిగింది. ఆ మూవీలో బాల భరతుడిగా అర్హ మెరిసింది. స్వచ్ఛమైన తెలుగులో అల్లు అర్హ చెప్పిన డైలాగులు అందర్నీ ఆకట్టుకున్నాయి. శాకుంతలం సినిమా అంతగా ఆడకపోయినా అల్లు అర్హ యాక్టింగ్‌కు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆరేళ్లకే తండ్రికి తగ్గ కూతురిగా అర్హ ప్రశంసలు పొందింది.
అభిమానులను భయపెట్టిన అల్లు అర్హ వీడియో:
శాకుంతలం సినిమా(Shaakuntalam Movie) తర్వాత అల్లు అర్హ(Allu arha)ను చూసేందుకు బన్నీ ఇంటికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన అభిమానులు అల్లు అర్హ భయపెట్టింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. అల్లు అర్హ ఇంటికెళ్లిన అభిమానులు ఈలలు, కేకలు వేస్తూ గోల గోల చేశారు. వారి కేకలకు బయటికి వచ్చిన అల్లు అర్హ అందర్నీ పలకరించడానికి వచ్చింది. ఆ సమయంలోనే కంటి రెప్పలను పైకి లేపి కళ్లను భయంకరంగా చూపింది. ఫ్యాన్స్ అల్లు అర్హను చూసి మరింత ఉత్సాహంగా కేకలు వేశారు.
అల్లు అర్హ(Allu Arha) అభిమానులను కళ్లతో భయపెట్టడంతో అక్కడున్న వారు నినాదాలు చేశారు. ఆ సమయంలో అక్కడున్న అమ్మాయి అర్హను ఎత్తుకుని వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. వీడియోను చూసి నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అర్హకు ఏమాత్రం భయం లేదని కొందరు అంటుంటే, మరికొందరు తెలుగు స్పష్టంగా మాట్లాడుతుందని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్హ మరిన్ని సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.