WGL: బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి వంశీ వర్మ మామునూరులోని అద్దె గదిలో సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. న్యూ ఇయర్ సెలవుల కోసం స్వగ్రామానికి వెళ్లి రెండు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.