KNR: శంకరపట్నం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిటైర్డ్ ఎంఈవో గొట్టె జమదగ్ని, కొరిమి ఉదయ్ కుమార్ సోమవారం కుర్చీలను వితరణ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వృద్ధుల సౌకర్యార్థం వారు ఈ సహాయాన్ని అందించారు. మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆసుపత్రి అవసరాలను గుర్తించి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు.