కెరీర్ స్టార్టింగ్ నుంచి తనదైన కామెడీతో ఎన్నో చిత్రాల్లో అలరించాడు అల్లరి నరేష్. అయితే మధ్యలో తన అల్లరితో మెప్పించలేకపోయాడు. దాంతో గతేడాది వచ్చిన నాంది మూవీతో యూ టర్న్ తీసుకొని.. మంచి విజయాన్ని అందుకున్నాడు నరేష్. దాంతో సాలిడ్‌గా కంబ్యాక్ అయినా నరేష్.. నాందితో కొత్త ప్రయాణం మొదలు పెట్టాడనే చెప్పాలి. కామెడీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. నాంది తరహాలో కంటెంట్ ఉన్న సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈక్రమంలో నరేష్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా చేస్తున్నాడు. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్ సరసన ఆనంది హీరోయిన్గా నటిస్తోంది. అయితే చాలా స్పీడ్‌గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. రిలీజ్‌కు రెడీ అయిపోయింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. నవంబర్ 11న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు.. ఓ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఇకపోతే.. ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడలతో మరోసారి కలిసి పని చేస్తున్నాడు నరేష్. ఈ మధ్యే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి షూటింగ్ స్టార్ట్ చేశారు. నాంది తరహాలోనే ఈ సినిమా కొత్త సినిమాకు ‘ఉగ్రం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈసినిమాతో పాటు ‘సభకు నమస్కారం’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నరేష్.