Akshay Kumar OMG 2 To Postpone Due To Censor Issues
OMG 2: అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఓ మైగాడ్ మూవీ ఎంత హిట్ అయ్యిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఈ సినిమాని తెలుగులో గోపాల గోపాల అని రీమేక్ కూడా చేశారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇక్కడ కూడా మంచి హిట్ అయ్యింది. ఓ మైగాడ్ మూవీకి సీక్వెన్స్ తెరకెక్కించారు. ఆ మూవీకి వాయిదా చిక్కులు వచ్చిపడ్డాయి.
అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ 2 సెన్సార్ నుండి A సర్టిఫికేట్ పొందడంతో వార్తల్లో నిలిచింది. అడల్ట్ సర్టిఫికేట్‌తో సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా, సెన్సార్ బోర్డు సినిమాకు 20 కట్స్ డిమాండ్ చేసింది. అక్షయ్ కుమార్ పాత్రను శివుడి నుంచి తన మెసెంజర్‌గా మార్చమని దర్శకుడు అమిత్ రాయ్‌ని సెన్సార్ బోర్డు కోరడం విశేషం. ఫలితంగా ఇప్పుడు మేకర్స్ అక్షయ్ కుమార్‌ని శివుడిగా చూపించిన సన్నివేశాలను తొలగించాలని లేదా వాటిని మార్చాలని ఒత్తిడి చేస్తున్నారు.
మూవీకి పెద్ద చిక్కులు వచ్చి పడ్డాయి. తిరిగి సినిమాని రీషూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సీన్స్ మార్చకుంటే సెన్సార్ ఒప్పుకోదు. ఆ సీన్స్ తొలగించాలి అంటే, మూవీ అర్థమే మారిపోతుంది. దీంతో ఏం చేయాలా అని మేకర్స్ డైలమాలో పడిపోయారట. నిజానికి ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కావాల్సి ఉంది. ఈ సమస్యల నేపథ్యంలో మేకర్స్ కూడా సినిమాను వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.