పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో'(Bromovie)పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి స్పందించారు. ఈ సినిమాలో తనను అవమానించేలా శ్యాంబాబు క్యారెక్టర్ (Shyambabu’s character)పెట్టారని ఆరోపించారు. త్వరలోనే తాము సినిమా తీస్తున్నట్లు మంత్రి అంబటి (Minister ambati) తెలిపారు. ‘ఓ వ్యక్తి పెళ్లి చేసుకోవడం, భార్యకు విడాకులు ఇవ్వడం, అదే సమయంలో మరొకరితో రిలేషన్లో ఉండటంపై సినిమా తీస్తున్నాం. కథ రెడీ అవుతోంది. నిత్య పెళ్లికొడుకు(Nitya peḷlikoḍuku) పెళ్లిళ్లు-పెటాకులు, తాళి-ఎగతాళి, 3 ముళ్లు-6 పెళ్లిళ్లు, MRO (మ్యారేజెస్, రిలేషన్స్, అఫెండర్) వంటి పేర్లు సినిమాకు పరిశీలిస్తున్నాం. ఈ సినిమాతో ప్రజలకు సందేశం ఇస్తాం’ అని ఆయన తెలిపారు. గత సంవత్సరం సంక్రాంతి పండుగ (Sankranti festival) సందర్బంగా అంబటి రాంబాబు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో వైరలు అయింది