అక్కినేని అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది 'ఏజెంట్'. సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దానికి అసలు కారణం ఇదేనంటున్నారు.
Akhil: అక్కినేని అఖిల్‌కు ఏజెంట్ సినిమాతో గట్టి దెబ్బ పడింది. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్. సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ మిషన్‌ను సక్సెస్ చేయలేకపోయాడు. ఒకవేళ ఏజెంట్ హిట్ అయి ఉంటే.. అఖిల్ క్రేజ్ వేరే లెవల్లో ఉండి ఉండేది. ఎందుకంటే.. ఏజంట్ రిలీజ్ తర్వాత అఖిల్ క్రేజ్ ఏమైపోతుందో? అనేలా ప్రమోషన్స్‌లో హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. తీరా థియేటర్లోకి వచ్చాక అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
అఖిల్ కెరీర్లోనే 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అదే రేంజ్లో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయినా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో రిస్క్ చేస్తున్నాడట అఖిల్. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. నెక్స్ట్ ప్రాజెక్ట్ యూవీ క్రియేషన్స్‌లో చేయబోతున్నాడు అఖిల్. ఈ చిత్రానికి అనిల్ కుమార్ అనే ఓ డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సినిమా భారీ సోసియో ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వడం లేదు. దానికి కారణం ఇదేనని అంటున్నారు.
ప్రజెంట్ నాగార్జున నా సామి రంగా, బిగ్ బాస్ 7తో బిజీగా ఉండటంతో జనవరిలో ఫైనల్ నెరేషన్ విన్నాక.. స్క్రిప్టు లాక్ చేయనున్నారట. వచ్చే సమ్మర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ప్రాజెక్ట్ కోసం ఏకంగా వంద కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నారట. కొత్త దర్శకుడు, అఖిల్ మార్కెట్‌కు యూవీ వారు ఏకంగా వంద 100 కోట్ల ఖర్చు చేస్తుండటం.. రిస్క్ అనే చెప్పాలి. అనిల్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నారట యూవీ క్రియేషన్స్ వారు. మరి అయ్యగారు ఈసారైనా పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి.