అక్కినేని యంగ్ హీరో అఖిల్(akhil).. స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ‘ఏజెంట్'(agent) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కల్నల్ పాత్రలో నటిస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో.. అఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోను ఏజెంట్‌తో మాసివ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. ఇప్పటికే రిలీజ్ అయిన ఏజెంట్ లుక్ అండ్ టీజర్లో బీస్ట్ లుక్‌లో కనిపిస్తున్నాడు అఖిల్(akhil). అయితే సినిమా విడుదల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతునే ఉంది. ముందుగా ఆగష్టులోనే అంటూ ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ షూటింగ్ లేట్ అవడంతో పోస్ట్ పోన్ చేశారు. అప్పటి నుంచి ఏజెంట్ వెనక్కి వెళ్తునే ఉన్నాడు. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు.
ఇకపోతే తాజాగా ఈ చిత్రంలో ఓ మాన్స్టర్ లుక్‌ని రిలీజ్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు.. విలన్ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే మొహం కనబడకుండా.. చేతిలో ఏకే 47 గన్ పట్టుకున్న ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైగా గన్ పట్టుకున్న చేతిపై ‘గాడ్’ అని ఉండడంతో.. సినిమాలో ఈ క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని చెప్పొచ్చు.