'ఏజెంట్' సినిమా పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అఖిల్ ఈ సినిమా కోసం చేసిన రిస్క్ ఏ సినిమాకు చేయలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని పలు ఇంటర్య్వూస్లలో చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా ఏజెంట్ మూవీ తనను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుందని ఫిక్స్ అయిపోయాడు. కానీ తీరా సినిమా థియేటర్లోకి వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. అఖిల్ పడిన కష్టం మొత్తం వృధా అయినట్టేనని అంటున్నారు ఆడియెన్స్.
సినిమాలోలాగే ప్రమోషన్స్‌లోను వైల్డ్‌గా బిహేవ్ చేశాడు అఖిల్. అసలు అఖిల్ ఎనర్జీ అండ్ స్టంట్స్ చూసి అంతా షాక్ అయ్యారు. అయితే సినిమాలో ఆ జోష్‌ను చూపించాడు కాబట్టే.. బయట కూడా అలాగే యాక్టివ్‌గా కనిపించాడు అఖిల్. ప్రమోషన్స్ అంతా తన భుజాల మీదే వేసుకున్న అఖిల్.. అందుకు తగ్గట్టే ఏజెంట్ పై మంచి హైప్ క్రియేట్ చేశాడు. ఎట్టకేలకు ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీ థియేటర్లోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత అక్కినేని అభిమానులు చేస్తున్న కామెంట్ ఒకటే.. సినిమా టాక్ ఎలా ఉన్నా, అఖిల్ మాత్రం కుమ్మేశాడని అంటున్నారు. ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలను చూస్తే.. పర్ఫార్మెన్స్ పరంగా ఏజెంట్లో ఇరగదీశాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అఖిల్ మెయింటేన్ చేసిన ఎనర్జీ లెవల్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ముఖ్యంగా అఖిల్ బాడీ బిల్డింగ్ మాత్రం అదిరిపోయింది. సిక్స్ ప్యాక్ బాడీతో హాలీవుడ్ హీరోని తలపించాడు ఈ వైల్డ్ సాలే. అఖిల్ కటౌట్‌కి అసలైన మాస్ బొమ్మ పడితే.. థియేటర్లు షేక్ అయిపోతాయి. కానీ ఏజెంట్లో ఆ దమ్ము లేదు. హై ఓల్టేజ్ యాక్షన్స్ సీన్స్ ఉన్నా.. సురేందర్ రెడ్డి టేకింగ్ గొప్పగా లేదు. అఖిల్ పడిన కష్టాన్ని.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. కథ, కథనం పరంగా సురేందర్ రెడ్డి మెప్పించలేకపోయాడు. అలాగే మ్యూజిక్ కూడా వరస్ట్‌గా ఉంది. బీజిఎం అయితే అస్సలు బాగాలేదంటున్నారు. ఈ సినిమాలో కేవలం అఖిల్ వన్ మ్యాన్ షో చేశాడు. రా ఏజెంట్‌గా తన పాత్ర కోసం.. అఖిల్ ఎంత చేయాలో అంత చేశాడు. కానీ ఏజెంట్ మిషన్ ఫెయిల్ అయిపోయింది. ఈ సినిమా కోసం పెట్టిన 80 కోట్ల వరకు ఖర్చు చేశారు నిర్మాత అనిల్ సుంకర. కాబట్టి ఏజెంట్ నష్టాలు తప్పవు. అయితే సినిమా పోయినా.. అఖిల్ మాత్రం యాక్టింగ్ పరంగా నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయాడనే చెప్పాలి.